కుదరదని చెప్పేశా.. 'గో టూ హెల్' అని వచ్చేశా!: క్యాస్టింగ్ కౌచ్ పై రాధికా ఆప్టే

  • నాక్కూడా వేధింపులు ఎదురయ్యాయి
  • తమాషా చేస్తున్నారా? అని అడిగాను
  • ఓ ఇంటర్వ్యూలో రాధికా ఆప్టే
బాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన నటి రాధికా ఆప్టే, తనకు కూడా అటువంటి వేధింపులు ఎదురయ్యాయని చెప్పింది. ఓ వెబ్ సైట్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, "బాలీవుడ్ లో ఓ సినిమా చేయాలని నాకు ఫోన్ చేశారు. ఆపై వారితో నేను సమావేశం అయ్యాను. ఓ వ్యక్తి పేరు చెప్పి, అతనితో ఓ రాత్రి గడపడానికి ఓకేనా? అని అడిగారు. నేను నవ్వాను. తమాషా చేస్తున్నారా? అని అడిగాను. కుదరదని చెప్పాను. గో టూ హెల్ అంటూ వచ్చేశాను" అని చెప్పింది.

కాగా, ఇటీవల ఆమె బీబీసీతో మాట్లాడుతూ, బాలీవుడ్ పెద్దలంతా తాము దేవుళ్లమని భావిస్తుంటారని, తాను ఏమైనా చెప్పినా నిలబడదని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదే విషయమై మరో నటి కల్కీ కోచ్ లిన్ మాట్లాడుతూ, "ఆఫ్ కోర్స్ క్యాస్టింగ్ కౌచ్ ఉంది. నన్ను కూడా తన గుప్పిట్లోకి తీసుకోవాలని చూసింది. అయితే నేను తప్పించుకున్నాను. ఎప్పుడైతే అసౌకర్యంగా అనిపిస్తుందో, అప్పుడు నేను అక్కడి నుంచి వచ్చేసేదాన్ని" అని పేర్కొనడం గమనార్హం.
Go Back to Shorts
Bollywood
Casting Couch
Radhika Apte

More Telugu News